![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద బిగ్ బాస్ అగ్నిపరీక్ష దుమ్ము రేపుతోంది. పాజిటివ్ ట్రోలింగ్ కంటే నెగటివ్ ట్రోలింగ్ తో టాప్ పొజిషన్ లో నిలిచి ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఐతే సీరియల్స్ విషయానికి వస్తే ఏ సీరియల్ టాప్ రేటింగ్ లో నిలుస్తోంది అనేది వీక్లీ రిపోర్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు ఓటిటి షోస్ , మూవీస్ విషయంలో కూడా ఆడియన్స్ ఎంత టైం చూసారు ఏ షో టాప్ లో కొనసాగుతోంది అనే వివరాలను అందిస్తోంది ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ మీడియా సంస్థ . రీసెంట్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది.
ఆడియన్స్ ట్రాకింగ్ ఆధారంగా 2026 ఆగస్టు 17-23 వరకు ఈ వారాంతంలో ఇండియన్ ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 కంటెంట్ లిస్ట్ ని ఈ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా స్తానం సంపాదించుకుంది. అది కూడా లెజండరీ హీరో అమితాబచ్చన్ చేసిన రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి షోతో సమానంగా ఈ షో రేటింగ్ ని సంపాదించుకుంది. ఈ విషయాన్నీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జి నవదీప్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.
ఓర్మాక్స్ మీడియా అంటే తెలుగు OTT ఆడియన్స్ ట్రాకర్. ప్రతీ వారం ఈ మీడియా సంస్థ ఆడియన్స్ ట్రాకర్ ద్వారా భారతదేశంలోని OTT ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా చూసే తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ కంటెంట్ వివరాలను అందిస్తూ ఉంటుంది . ఇందులో సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ షో టాప్ లో ఉందో ఆడియన్స్ ఎక్కువగా ఎం చూస్తున్నారో ట్రాక్ చేస్తుంది. ఒక వ్యక్తి ఒక కంటెంట్‌ను కనీసం 30 నిమిషాలు చూస్తే అక్కడి నుంచి ఆ షో ట్రాకింగ్ మొదలవుతుంది. ఈ ట్రాకర్‌లో తెలుగు ఆడియన్స్ ఏ షో, ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలను ఎక్కువగా చూస్తున్నారో తెలుసుకోవచ్చు.
ఈ ట్రాకింగ్ న్యూస్ అటు ప్రొడ్యూసర్స్ కి, OTT ప్లాట్‌ఫామ్‌లు, యాడ్స్ ఇచ్చేవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. తెలుగు ప్రేక్షకుల OTT వినియోగాన్ని హిందీ, ఇతర ప్రాంతీయ భాషల ప్రేక్షకులతో కూడా పోల్చి చూస్తుంది. గత వారం డేటా ఆధారంగా ఈ షో ట్రాకింగ్ వివరాలను ప్రతి మంగళవారం విడుదల చేస్తారు. ఈ డేటాను సేకరించేందుకు ఓర్మాక్స్ మీడియా ఆన్‌లైన్ సర్వేలు, రోజువారీ OTT ప్రేక్షకుల ప్యానెల్స్, భారతదేశంలోని మొత్తం స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆధారంగా అంచనాలు వేస్తుంది. ఓర్మాక్స్ మీడియా ముంబై కేంద్రంగా పని చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన కన్సల్టింగ్ , ఆడియన్స్ రీసెర్చ్ సంస్థ. మీడియా , వినోద రంగంలో ప్రేక్షకులు ఏ కంటెంట్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు.
![]() |
![]() |